Shabnam Shakeel: భారత్ ‘ఎ’ జట్టులో తెలుగమ్మాయి షబ్నం షకీల్
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:50 AM
ఆంధ్ర యువ క్రికెటర్ షబ్నం షకీల్ భారత్ ‘ఎ’ జట్టుకు ఎంపికైంది. వచ్చే నెల 7 నుంచి 24 వరకు ఆస్ర్టేలియా ‘ఎ’ జట్టుతో మూడు టీ20, మూడు వన్డేల సిరీ్‌సలతో పాటు భారత్...
ఆసీస్ ‘ఎ’తో పరిమిత ఓవర్ల సిరీస్
న్యూఢిల్లీ: ఆంధ్ర యువ క్రికెటర్ షబ్నం షకీల్ భారత్ ‘ఎ’ జట్టుకు ఎంపికైంది. వచ్చే నెల 7 నుంచి 24 వరకు ఆస్ర్టేలియా ‘ఎ’ జట్టుతో మూడు టీ20, మూడు వన్డేల సిరీ్‌సలతో పాటు భారత్ నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది. దీని కోసం సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించారు. ఇందులో 18 ఏళ్ల వైజాగ్ పేసర్ షబ్నంకు టీ20, వన్డే జట్లలో చోటు దక్కడం విశేషం. రెండేళ్ల క్రితం అండర్-19 టీ20 వరల్డ్‌క్‌పలో విజేతగా నిలిచిన భారత జట్టులో షబ్నం సభ్యురాలు. ఇక భారత్ ‘ఎ’ జట్లకు స్పిన్నర్ రాధా యాదవ్ నేతృత్వం వహిస్తుండగా, స్పిన్నర్లు శ్రేయాంక, ప్రియా మిశ్రా, షఫాలీ, టిటాస్ సాధు తదితరులు చోటు దక్కించుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఇన్‌కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి