Japan Open: టైటిల్‌పై సాత్విక్ జోడీ గురి
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:53 AM
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టైటిల్‌పై భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి గురి పెట్టింది. ఈ సీజన్‌లో...
జపాన్ ఓపెన్
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టైటిల్‌పై భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి గురి పెట్టింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు టోర్నీల్లో సెమీస్ చేరిన సాత్విక్ జోడీ టైటిల్ సాధించలేకపోయింది. అయితే మంగళవారం నుంచి జరుగనున్న ఈ టోర్నీతో ఆ లోటును భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక, చాలా కాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, పీవీ సింధు సింగిల్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరితో పాటు ఉన్నతి హూడా, అనుపమ ఉపాధ్యాయ, రక్షిత రామ్‌రాజ్, డబుల్స్‌లో హరిహరన్-రుబాన్ కుమార్, కవిప్రియ-సిమ్రాన్ సింగీ, రుతుపర్ణ-శ్వేతపర్ణ జోడీలు బరిలోకి దిగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి