Share News

Hong Kong Open 2025: టైటిల్‌కు అడుగు దూరంలో

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:15 AM

కొన్నాళ్లుగా టైటిల్‌ వేటలో వెనుకంజలో నిలిచిన భారత షట్లర్లు హాంకాంగ్‌ ఓపెన్‌లో డబుల్‌ ధమాకా సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌.. డబుల్స్‌లో స్టార్‌ జోడీ...

Hong Kong Open 2025: టైటిల్‌కు అడుగు దూరంలో

ఫైనల్లో సాత్విక్‌ జోడీ, లక్ష్య

హాంకాంగ్‌ ఓపెన్‌

హాంకాంగ్‌: కొన్నాళ్లుగా టైటిల్‌ వేటలో వెనుకంజలో నిలిచిన భారత షట్లర్లు హాంకాంగ్‌ ఓపెన్‌లో డబుల్‌ ధమాకా సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌.. డబుల్స్‌లో స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. శనివారం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో లక్ష్య 23-21, 22-20 చైనీస్‌ తైపీకి చెందిన ప్రపంచ 9వ ర్యాంకర్‌ చో తిన్‌ చెన్‌ను ఓడించాడు. దాదాపు గంటసేపు సాగిన ఉత్కంఠపోరులో మూడో సీడ్‌ చో తిన్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. లక్ష్య ధీటుగా విజృంభించి విజయం సాధించాడు. సూపర్‌ 500 టోర్నీలో ఫైనల్‌ చేరడం 23 ఏళ్ల లక్ష్య సేన్‌కు ఇది గత రెండేళ్లలో తొలిసారి కావడం గమనార్హం. అతను చివరిగా 2023 జులైలో కెనడా ఓపెన్‌లో టైటిల్‌ పోరుకు చేరాడు. 20వ ర్యాంకరైన లక్ష్య.. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్‌ లి షి ఫెంగ్‌ (చైనా)తో తలపడనున్నాడు. ఇక, పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంక్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ 21-17, 21-15తో చైనీస్‌ తైపీ జంట బింగ్‌ వీ లిన్‌/చెన్‌ చెంగ్‌ కువాన్‌పై గెలిచింది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షి్‌పలో కాంస్యం నెగ్గిన సాత్విక్‌ ద్వయం ఈ సీజన్‌లో ఓ టోర్నీ ఫైనల్‌ చేరడం ఇదే మొదటిసారి. టైటిల్‌ పోరులో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, చైనా జంట లియాంగ్‌ వీ కెంగ్‌/వాంగ్‌ చాంగ్‌తో సాత్విక్‌ జోడీ అమీతుమీ తేల్చుకోనుంది.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 14 , 2025 | 05:15 AM