Share News

BWF World Tour Finals: సెమీస్‌కు చేరువలో సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Dec 19 , 2025 | 06:27 AM

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ నాకౌట్‌కు మరింత చేరువైంది. వరుసగా రెండో గ్రూప్‌ మ్యాచ్‌లోనూ...

BWF World Tour Finals: సెమీస్‌కు చేరువలో సాత్విక్‌ జోడీ

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌

హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ నాకౌట్‌కు మరింత చేరువైంది. వరుసగా రెండో గ్రూప్‌ మ్యాచ్‌లోనూ సాత్విక్‌ జంట విజయం సాధించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ ‘బి’ ఉత్కంఠ పోరులో భారత ద్వయం 21-11, 16-21, 21-11 స్కోరుతో ఇండోనేసియా జోడీ ఫజర్‌ అల్ఫియాన్‌/మహ్మద్‌ ఫిక్రీని చిత్తు చేసింది. శుక్రవారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో రెండో సీడ్‌ జోడీ ఆరోన్‌ చియా/సో వూ యిక్‌ (మలేసియా)ను మూడో సీడ్‌ భారత ద్వయం ఎదుర్కొంటుంది.

ఇవీ చదవండి:

Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

Updated Date - Dec 19 , 2025 | 06:27 AM