క్రికెట్‌కు సాహా వీడ్కోలు
ABN , Publish Date - Feb 02 , 2025 | 02:46 AM
భారత వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా (40) కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీల్లో బెంగాల్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన సాహా.. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్టు శనివారం...
కోల్‌కతా: భారత వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా (40) కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీల్లో బెంగాల్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన సాహా.. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్టు శనివారం ఎక్స్‌లో ప్రకటించాడు. 2010 ఫిబ్రవరిలో సౌతాఫ్రికాతో టెస్టుతో అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టిన సాహా.. భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 3 శతకాలు సహా 1353 రన్స్ చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్, త్రిపుర తరఫున ఆడాడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ కీపర్‌గా సాహాకు అవకాశాలు వచ్చాయి. అయితే, పంత్ సీన్‌లోకి రావడంతో అతడి కథ ముగిసింది.
ఇవీ చదవండి:
ఒకే ఓవర్‌లో 3 వికెట్లు.. భారత్ పుట్టి ముంచిన కుర్ర పేసర్
టీమిండియాకు బ్యాడ్ లక్.. టాస్‌లో ఇలా జరిగిందేంటి
కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి