Ross Taylor Comeback: రాస్ టేలర్ మళ్లొచ్చాడు
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:47 AM
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. 2021, డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ 41 ఏళ్ల వెటరన్ తాజాగా సమోవా జట్టు తరఫున...
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. 2021, డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ 41 ఏళ్ల వెటరన్ తాజాగా సమోవా జట్టు తరఫున ఆడబోతున్నట్టు ప్రకటించాడు. టేలర్ తల్లిది సమోవా దేశం కావడంతో అక్కడి పాస్‌పోర్ట్ కూడా తనకు ఉంది. అంతేకాకుండా కివీస్ తరఫున ఆడి మూడేళ్లు పూర్తి కావడంతో టేలర్ మరో జట్టుకు ఆడడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో చోటు కోసం ఆసియా-ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్‌లో సమోవా తరఫున టేలర్ బరిలోకి దిగుతాడు.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..