Australia one day series: ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్.. రంగంలోకి రోహిత్, విరాట్?
ABN , Publish Date - Oct 03 , 2025 | 10:02 PM
ఆస్ట్రేలియాలో జరగనున్న వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు సెలక్టర్లు శనివారం సమావేశం కానున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యంపై చర్చ కొనసాగుతూనే ఉంది. వన్డే ఫార్మాట్‌లో ఇప్పటికీ ఇద్దరూ కొనసాగుతూనే ఉన్నారు. అయితే, అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న మూడు వన్డేల్లో రోహిత్, విరాట్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై చర్చించేందుకు శనివారం సెలక్టర్లు సమావేశం కానున్నారు. ఇప్పటికే పలు టీమిండియా ప్లేయర్లు వివిధ కారణాలతో జట్టుకు దూరంగా ఉన్నారు (Virat Kohli comeback ODIs).
గాయం కారణంగా హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండరు. శుభ్‌మన్ గిల్ ఇప్పటికే వరుస మ్యాచులతో అలసిపోయాడు. ఆసియా కప్ తరువాత మూడు రోజుల వ్యవధి తరువాత వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగాడు. దీంతో, అతడికి ఆస్ట్రేలియా టూర్ నుంచి మినహాయింపును ఇచ్చే అవకాశం కనిపిస్తుంది (Rohit Sharma return India).
ఇక రోహిత్ నాయకత్వ పటిమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ అతడు కెప్టెన్‌గా తక్కువ వైఫల్యాలనే ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం టెస్టులు, టీ20 నుంచి రోహిత్, విరాట్ ఇద్దరూ తప్పుకున్నాడు. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నారు. ఇక ఈ సీజన్‌లో ఆరు వన్డేలు మాత్రమే ఉన్నాయి. మూడు ఆస్ట్రేలియాలో జరగనుండగా మరో మూడు న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్నాయి. అయితే, వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌పై భారత్ దృష్టి పెట్టింది. వీలైనన్ని డబ్ల్యూటీసీ పాయింట్స్ స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
మహిళల వరల్డ్ కప్.. పాక్ జట్టుతో టీమిండియా జట్టు షేక్ హ్యాండ్‌పై బీసీసీఐ సెక్రెటరీ స్పందన
పాక్ క్రికెట్‌లో సంక్షోభం.. నఖ్వీ రాజీనామా చేయాలని అఫ్రీది డిమాండ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి