Share News

ICC ODI Rankings: రోహిత్‌ నెం 2

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:32 AM

ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకుల్లో రోహిత్‌ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ను వెనక్కు నెట్టిన రోహిత్‌ 756 పాయింట్లతో...

ICC ODI Rankings: రోహిత్‌ నెం 2

  • వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌

దుబాయ్‌ : ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకుల్లో రోహిత్‌ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ను వెనక్కు నెట్టిన రోహిత్‌ 756 పాయింట్లతో రెండో స్థానం చేజిక్కించుకున్నాడు. ఇటీవల వెస్టిండీ్‌సతో జరిగిన వన్డే సిరీ్‌సలో విఫలం కావడంతో బాబర్‌ (751) ర్యాంక్‌ మూడుకు పడిపోయింది. భారత జట్టు టెస్ట్‌ కెప్టెన్‌ గిల్‌ (784 పాయింట్లు) నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ (736) నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక..టా్‌ప-15లో మొత్తం ఐదుగురు భారత బ్యాటర్లుండడం విశేషం. శ్రేయాస్‌ 8, కేఎల్‌ రాహుల్‌ 15వ ర్యాంక్‌ దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 01:32 AM