ICC ODI Rankings: రోహిత్ తొలిసారి నెం 1
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:11 AM
కెరీర్‌లో తొలిసారి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో అజేయంగా 121 పరుగులతో అదరగొట్టిన రోహిత్.. రెండు స్థానాలు...
కెరీర్‌లో తొలిసారి టాప్ ర్యాంక్ సొంతం
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: కెరీర్‌లో తొలిసారి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో అజేయంగా 121 పరుగులతో అదరగొట్టిన రోహిత్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని నెం:1 ర్యాంక్‌ను కైవసం చేసుకొన్నాడు. శుభ్‌మన్ గిల్ మూడో స్థానానికి పడిపోయాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ టాప్-10లోనే నిలిచిన 38 ఏళ్ల రోహిత్ చరమాంకంలో కెరీర్ బెస్ట్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఆల్‌రౌండర్ల విభాగంలో అక్షర్ పటేల్ నాలుగు మెట్లెక్కి ఎనిమిదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.
Also Read:
రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్
సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్