Vijay Hazare Trophy 2025: ‘హజారే’ ఆటలో రోహిత్, విరాట్ ఫీజులు ఎంతంటే
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:56 AM
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండడంతో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కొత్త కళ సంతరించుకుంది. అయితే ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్న...
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండడంతో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కొత్త కళ సంతరించుకుంది. అయితే ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్న రోహిత్, కోహ్లీకి బీసీసీఐ ఎంత చెల్లిస్తుందనే ప్రశ్న చాలామందిలో ఉంది. బీసీసీఐ వర్గాల ప్రకారం.. వీళ్లిద్దరు ఒక్కో మ్యాచ్‌కు రూ. 60 వేలు రుసుముగా అందుకుంటున్నారు. ఇదిగాక ప్రయాణ, ఆహార, వసతి భత్యాలు అదనంగా చెల్లిస్తారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిస్తే అదనంగా రూ. 10 వేలు లభిస్తాయి. కాగా..ఒక్కో అంతర్జాతీయ వన్డేకు రోహిత్, విరాట్‌లకు బోర్డు రూ. 6 లక్షల చొప్పున ఇస్తుంది.
ఇవి కూడా చదవండి
తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్