Share News

Tennis Hall of Fame Roger Federer: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ లో ఫెడరర్‌

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:29 AM

టెన్నిస్‌ దిగ్గజం, స్విట్జర్లాండ్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌కు ప్రతిష్టాత్మక ‘టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు దక్కింది. వచ్చే ఏడాదికిగాను ఆటగాళ్ల కేటగిరిలో రోజర్‌ ఒక్కడే ఈ పురస్కారానికి...

Tennis Hall of Fame Roger Federer: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ లో ఫెడరర్‌

న్యూయార్క్‌: టెన్నిస్‌ దిగ్గజం, స్విట్జర్లాండ్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌కు ప్రతిష్టాత్మక ‘టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు దక్కింది. వచ్చే ఏడాదికిగాను ఆటగాళ్ల కేటగిరిలో రోజర్‌ ఒక్కడే ఈ పురస్కారానికి ఎంపికైనట్టు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. 2026 ఆగస్టులో జరిగే వేడుకలో రోజర్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ పురస్కారాన్ని అందజేస్తారు. ప్రొఫెషనల్‌ కెరీర్‌కు దూరమై ఐదేళ్లు దాటినవారిని ఆటగాళ్ల విభాగంలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఎంపికకు అర్హులుగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి:

Venkatesh Iyer T20 XI: ఆల్‌టైమ్‌ టీ20 జట్టు.. రోహిత్‌, కోహ్లి దక్కని చోటు!

IND VS SA: ఘోరంగా విఫలమైన అభిషేక్, తిలక్, రుతురాజ్.. భారత్ ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 20 , 2025 | 06:29 AM