Share News

వైభవంగా రింకూ నిశ్చితార్థం

ABN , Publish Date - Jun 09 , 2025 | 05:16 AM

క్రికెటర్‌ రింకూ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ యువ ఎంపీ ప్రియా సరోజ్‌ నిశ్చితార్థం ఆదివారం ఇక్కడ జరిగింది. ఓ హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ...

వైభవంగా రింకూ నిశ్చితార్థం

లఖ్‌నవూ: క్రికెటర్‌ రింకూ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ యువ ఎంపీ ప్రియా సరోజ్‌ నిశ్చితార్థం ఆదివారం ఇక్కడ జరిగింది. ఓ హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ఓ భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. తన చేతికి రింకూ సింగ్‌ నిశ్చితార్థ ఉంగరం తొడుగుతున్న సమయంలో ప్రియా సరోజ్‌ తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకోవడం కనిపించింది. ఆ భావోద్వేగం నుంచి బయటపడేందుకు ఆమెకు కొంచెం సమయం పట్టింది. తేరుకున్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్న రింకూ సింగ్‌..ఇద్దరి చేతులను పైకెత్తాడు. అంగరంగ వైభవంగా జరిగిన రింకూ-ప్రియా ఎంగేజ్‌మెంట్‌కు క్రికెటర్లు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వీరిలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఎంపీలు జయాబచ్చన్‌, డింపుల్‌ యాదవ్‌, ప్రొఫెసర్‌ రాంగోపాల్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ శుక్లా, క్రికెటర్లు ప్రవీణ్‌ కుమార్‌, పియూష్‌ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్‌ ఆర్యన్‌ జుయల్‌ ఉన్నారు.

ఇవీ చదవండి:

రింకూ కాబోయే భార్య ఎమోషనల్

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 05:16 AM