Share News

IPL 2025: 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం.. హైదరాబాద్‌లో సందడి మామూలుగా లేదు..

ABN , Publish Date - Jun 04 , 2025 | 01:17 PM

IPL 2025: హైదరాబాద్ నగరంలో నిన్న ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. బెంగళూరు నగరాన్ని తలపించేలా సందడి చేశారు. కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆర్సీబీ అభిమానులు గుమిగూడారు.

IPL 2025: 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం.. హైదరాబాద్‌లో సందడి మామూలుగా లేదు..
IPL 2025

ఒకటి కాదు.. పది కాదు.. ఏకంగా 18 సంవత్సరాలు.. వరుస అపజయాలు, అవమానాలు ఎదురైనా.. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆర్సీబీ మాత్రం వెనక్కు తగ్గలేదు. ‘ఈ సాల కప్ నమదే’ అన్న నమ్మకంతో గుడ్డిగా ముందుకు వెళ్లింది. 18 సంవత్సరాల ఎదురుచూపు ఫలించింది. ఐపీఎల్ 2025లో కప్పు కొట్టింది. నిన్న పంజాబ్‌ కింగ్స్ ‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ విజయంతో కేవలం కన్నడనాట మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ పండుగ చేసుకుంటున్నారు.


మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిన్న ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. బెంగళూరు నగరాన్ని తలపించేలా సందడి చేశారు. కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆర్సీబీ అభిమానులు గుమిగూడారు. ఆ ప్రాంతం వారితో కిక్కిరిసిపోయింది. ఆర్సీబీ అభిమానులు డ్యాన్సులు చేస్తూ.. టపాసులు పేలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో నిన్న రాత్రి ఆర్సీబీ ఫీవర్ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లక్షకుపైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్‌తో దూసుకుపోతున్నాయి.


ప్రముఖులు సైతం ఎమోషనల్

ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలిసారి విజయం సాధించటంపై రాజకీయ, సినీ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు. ఒకరకంగా వారంత ఎమోషనల్ అయ్యారు. ఆర్సీబీ విజయంపై.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య , మధ్య‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం మోహన్ యాదవ్, డీకే శివకుమార్, హీరో వెంకటేష్ , ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, రష్మిక, విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు, సాయి దుర్గా తేజ్, రణ్‌వీర్ సింగ్ తదితరులు స్పందించారు.


ఇవి కూడా చదవండి

కర్ణాటక సీఎం టు రణ్‌వీర్ సింగ్.. ఆర్సీబీ విజయంపై ప్రముఖులు ఏమన్నారంటే..

డా. దత్తాత్రేయుడు నోరి అధ్వర్యంలో ఘనంగా బాబా గుడి 25వ వార్షికోత్సవం

Updated Date - Jun 04 , 2025 | 01:53 PM