RCB victory parade: షాకింగ్.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట.. 11 మంది మృతి
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:49 PM
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పు సాధించిన ఆనందంలో అభిమానులు భారీగా చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పు సాధించిన ఆనందంలో అభిమానులు భారీగా చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. చిన్నస్వామి స్టేడియం లోపలికి అభిమానులు తోసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారికేడ్లు దూకి స్టేడియంలోకి వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించారు.
భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు. వారిని వివిధ అస్పత్రులకు తరలించారు. అభిమానులను నియంత్రించేందుకు చిన్నస్వామి స్టేడియం దగ్గర పోలీసులు లాఠీఛార్జ్ ప్రారంభించారు. స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: నిన్ను ముద్దాడడం కోసం 18 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
IPL Final 2025: నెరవేరిన 18 ఏళ్ల కల.. ఈ సారి కప్పు ఆర్సీబీదే.. పంజాబ్‌పై గెలుపు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..