Share News

రెండు దశలలో రంజీట్రోఫీ

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:31 AM

ఈసారి రంజీ ట్రోఫీ (2025-26) అక్టోబరు 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు రెండు దశలలో జరగనుంది. ఈమేరకు శనివారం జరిగిన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం...

రెండు దశలలో రంజీట్రోఫీ

దేశవాళీ టోర్నీలో మార్పులు

న్యూఢిల్లీ: ఈసారి రంజీ ట్రోఫీ (2025-26) అక్టోబరు 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు రెండు దశలలో జరగనుంది. ఈమేరకు శనివారం జరిగిన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయించింది. అలాగే ఈ సీజన్‌ రంజీట్రోఫీలో మార్పులు కూడా చోటు చేసుకోనున్నాయి. వచ్చే సీజన్‌నుంచి ప్లేట్‌గ్రూపు నుంచి ఎలీట్‌కు ఒక్కోజట్టు మాత్రమే పదోన్నతి, రెలిగేషన్‌ అవనున్నాయి. రంజీ తొలి దశ అక్టోబరు 15 నుంచి నవంబరు 19 వరకు, రెండో దశ జనవరి 22 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు నిర్వహిస్తారు. నాకౌట్‌ ఫిబ్రవరి 6 నుంచి 28 వరకు జరుగుతుంది. దులీప్‌ ట్రోఫీని ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 15 వరకు నిర్వహిస్తారు. ఇరానీ కప్‌ అక్టోబరు ఒకటి నుంచి 5 వరకు జరుగుతుంది. ముస్తాక్‌ అలీ టోర్నీలో సూపర్‌ లీగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. అలాగే ప్లేట్‌ గ్రూప్‌నూ పునఃపవేశపెడుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 04:31 AM