PV Sindhu Suffers Early Exit: అన్‌సీడెడ్ చేతిలో
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:45 AM
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు హాంకాంగ్ ఓపెన్‌లో చుక్కెదురైంది. ఈ భారత స్టార్ అనూహ్యంగా ఆదిలోనే అన్‌సీడెడ్ చేతిలో పరాజయం పాలై నిరాశపరచింది....
సింధు పరాజయం
ప్రణయ్, సేన్ ముందంజ
హాంకాంగ్ ఓపెన్
హాంకాంగ్: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు హాంకాంగ్ ఓపెన్‌లో చుక్కెదురైంది. ఈ భారత స్టార్ అనూహ్యంగా ఆదిలోనే అన్‌సీడెడ్ చేతిలో పరాజయం పాలై నిరాశపరచింది. డెన్మార్క్‌కు చెందిన క్రిస్టోఫర్సెన్ 15-21, 21-16, 21-19తో సింధుకు షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 22-20, 16-21, 21-15తో తైపీ ఆటగాడు వాంగ్ జూ వీపై, ప్రణయ్ 21-17, 21-14తో చైనా షట్లర్ లూ గువాంగ జూపై, ఆయుష్ శెట్టి 15-21, 21-19, 21-13తో సూ లి యాంగ్ (తైపీ)పై, కిరణ్ జార్జ్ 21-16, 21-11తో జియా హెంగ్ జాసన్ తె (సింగపూర్)పై గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల డబుల్స్‌లో రీతుపర్ణ పండా/శ్వేతపర్ణ పండా జోడీ 21-17, 21-9తో స్థానిక జంట వానెస్సా పాంగ్/సమ్ యూ వాంగ్‌పై గెలిచి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించింది. సింగిల్స్‌లో రక్షిత రామరాజు, అనుపమ ఉపాధ్యాయ, మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా/ధ్రువ్ కపిల, రుత్వికా శివాని/రోహన్ కపూర్ ద్వయం జోడీలు ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి