Share News

పోరాడి ఓడిన సింధు

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:39 AM

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది....

పోరాడి ఓడిన సింధు

  • ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప

నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం వరల్డ్‌ నెంబర్‌ 4 యమగూచి (జపాన్‌)తో గంటా ఆరు నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ పోరులో ప్రపంచ 17వ ర్యాంకర్‌ సింధు పోరాడి ఓడింది. సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సింధు 12-21, 21-16, 16-21తో యమగూచి చేతిలో పరాజయం పాలైంది. యమగూచితో పోరులో సింధు ఓడడం ఇది పన్నెండో సారి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో ధ్రువ్‌-తనీషా జంట 12-21, 21-16, 21-18తో హాంగ్‌ వీ-నికోల్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీపై గెలిచి ముందంజ వేసింది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత జంట సూర్య-అమృత ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రియాన్షు రజావత్‌ 14-27, 17-21 స్కోరుతో కొడై నరోకా (జపాన్‌) చేతిలో వరుసగా రెండు గేమ్‌ల్లో ఓడాడు. ప్రియాన్షుతో పాటు కిరణ్‌జార్జ్‌ కూడా రెండో రౌండ్‌లో ఓడి ఇంటిముఖం పట్టాడు. డబుల్స్‌లో హరిహరణ్‌-రుబాన్‌ కుమార్‌ జోడీ కూడా ఓటమి చవి చూసింది.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2025 | 05:39 AM