Badminton: సింధు తొలి రౌండ్లోనే..
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:16 AM
భారత స్టార్ పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆరంభ రౌండ్లోనే పరాజయం పాలైంది. కొరియా షట్లర్ సిమ్ యు జిన్‌తో బుధవారం జరిగిన పోరులో మాజీ ప్రపంచ చాంపియన్ సింధు...
జపాన్ ఓపెన్‌లో భారత స్టార్ పరాజయం
సాత్విక్ జోడీ, లక్ష్య, అనుపమ ముందంజ
టోక్యో: భారత స్టార్ పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆరంభ రౌండ్లోనే పరాజయం పాలైంది. కొరియా షట్లర్ సిమ్ యు జిన్‌తో బుధవారం జరిగిన పోరులో మాజీ ప్రపంచ చాంపియన్ సింధు 15-21, 14-21తో చిత్తయింది. ఇలా.. తొలి రౌండ్లోనే ఓడడం ఈ ఏడాదిలో సింధుకిది ఐదోసారి కావడం గమనార్హం. మిగతా భారత అమ్మాయిల్లో అనుపమ ఉపాధ్యాయ 21-15, 18-21, 21-18తో సహచర షట్లర్ రక్షితపై నెగ్గగా, ఉన్నతి హుడా 8-21, 12-21తో పోర్న్ చోచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21-11, 21-18తో వాంగ్ జెంగ్ (చైనా)ను ఓడించి రెండో రౌండ్ చేరాడు. డబుల్స్‌లో ప్రపంచ 15వ ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి 21-18, 21-10తో కొరియా జంట కాంగ్ మిన్/కిమ్ డోంగ్‌ను చిత్తుచేసి టోర్నీలో శుభారంభం చేసింది. డబుల్స్‌లో హరిహరణ్/రూబన్ కుమార్ జోడీ, మహిళల డబుల్స్‌లో కవిప్రియ/సిమ్రన్ ద్వయం ప్రత్యర్థుల చేతిలో ఓడి ఆదిలోనే ఇంటిబాట పట్టారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి