Share News

China Open 2025: ప్రీక్వార్టర్స్‌లో ప్రణయ్‌

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:19 AM

చైనా ఓపెన్‌ తొలి రౌండ్‌లో హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ అదరగొట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో తను ఏకంగా ఐదు మ్యాచ్‌ పాయింట్లను కాచుకుని కోకి...

China Open 2025: ప్రీక్వార్టర్స్‌లో ప్రణయ్‌

చాంగ్జౌ: చైనా ఓపెన్‌ తొలి రౌండ్‌లో హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ అదరగొట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో తను ఏకంగా ఐదు మ్యాచ్‌ పాయింట్లను కాచుకుని కోకి వటనబే (జపాన్‌)పై 8-21, 21-16, 23-21 తేడాతో గెలిచాడు. తొలి గేమ్‌లో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన ప్రణయ్‌.. రెండో గేమ్‌లో మాత్రం జోరు చూపి నిలిచాడు. ఇక నిర్ణాయక గేమ్‌లో 2-11తో వెనుకబడినా పుంజుకుని వరుసగా ఐదు పాయింట్లు సాధించాడు. అలాగే 15-20తో ఓటమి ఖాయమనిపించినా.. ప్రత్యర్థి ఐదు మ్యాచ్‌ పాయింట్లను వమ్ము చేసి 21-20తో లీడ్‌లోకి వచ్చి పట్టు కోల్పోలేదు. మరోవైపు లక్ష్యసేన్‌ 21-14, 22-24, 11-21 తేడాతో లి షి ఫెంగ్‌ (చైనా) చేతిలో తొలి రౌండ్‌లోనే ఓడాడు. మహిళల సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సూర్య-ప్రముతేష్‌, రోహన్‌ కపూర్‌-రుత్విక జోడీలకు ఓటమి ఎదురైంది.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 04:19 AM