Share News

ప్రణతికి కాంస్యం

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:46 AM

భారత్‌కు చెందిన ప్రణతి నాయక్‌ ఆసియా సీనియర్‌ మహిళల ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షి్‌ప వాల్ట్‌ విభాగంలో కాంస్యం సాధించింది. దక్షిణకొరియాలోని...

ప్రణతికి కాంస్యం

ఆసియా జిమ్నాస్టిక్స్‌

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ప్రణతి నాయక్‌ ఆసియా సీనియర్‌ మహిళల ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షి్‌ప వాల్ట్‌ విభాగంలో కాంస్యం సాధించింది. దక్షిణకొరియాలోని జెచియాన్‌లో శనివారం జరిగిన ఫైనల్లో 30 ఏళ్ల ప్రణతి 13.466 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానం దక్కించుకుంది. యిహాన్‌ ఝాంగ్‌ (చైనా, 13.650) స్వర్ణం, థీ క్విన్‌ (వియత్నాం, 13.583) రజతం నెగ్గారు. భారత్‌కే చెందిన ప్రొతిష్ట సమంత (13.016) నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో ఆసియా స్థాయి పోటీలలో 3 పతకాలు అందుకున్న భారత జిమ్నా్‌స్టగా ప్రణతి రికార్డుకెక్కింది. దీంతో దీపా కర్మాకర్‌ (రెండు పతకాలు)ను అధిగమించింది. 2019, 2022 ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో ప్రణతి కాంస్యాలు నెగ్గింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 04:46 AM