Abia Para Badminton Tournament: భగత్‌కు మూడు స్వర్ణాలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:59 AM
నైజీరియాలో జరిగిన అబియా పారా బ్యాడ్మింటన్ టోర్నీలో ఏస్ షట్లర్ ప్రమోద్ భగత్ మూడు స్వర్ణాలు సాధించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన ప్రమోద్.. ఆ తర్వాత నాడాకు...
న్యూఢిల్లీ: నైజీరియాలో జరిగిన అబియా పారా బ్యాడ్మింటన్ టోర్నీలో ఏస్ షట్లర్ ప్రమోద్ భగత్ మూడు స్వర్ణాలు సాధించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన ప్రమోద్.. ఆ తర్వాత నాడాకు మూడుసార్లు తాను ఎక్కడ ఉన్నదీ తెలియజేయలేదు. దీంతో 18 నెలల నిషేధానికి గురైన భగత్.. పారిస్ పారాలింపిక్స్‌లో ఆడలేకపోయాడు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 కేటగిరీలో భారత షట్లర్ల మధ్య జరిగిన ఫైనల్లో ప్రమోద్ 21-7, 9-21, 21-9తో మాంటు కుమార్‌పై గెలిచాడు. డబుల్స్ తుదిపోరులో ప్రమోద్-సుకాంత్ కదమ్ జోడీ 21-13, 21-17తో నెగ్గింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆర్తీ పాటిల్‌తో కలసి ఆడిన ప్రమోద్ మూడో బంగారు పతకాన్ని సొంతం చేసుకొన్నాడు. మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్3లో రజతం సాధించిన ఉమా సర్కార్.. డబుల్స్‌లో ఆర్తితో కలసి కాంస్యం అందుకొంది. డబ్ల్యూహెచ్1 విభాగంలో రంజిత్ సింగ్ మూడు కాంస్యాలు దక్కించుకొన్నాడు. ఎస్‌యు5 కేటగిరీలో కరణ్, రాహుల్, సతివద స్వర్ణ, రజత, కాంస్యాలతో క్లీన్‌స్వీ్‌ప చేశారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి