India A Clinches the Series: ప్రభ్‌సిమ్రాన్ సెంచరీ
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:40 AM
ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు మ్యాచ్‌ల అనధికార వన్డే సిరీ్‌సను భారత్ ‘ఎ’ 2-1తో దక్కించుకుంది. ఆదివారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ రెండు వికెట్లతో నెగ్గింది...
మూడో వన్డేలో
ఆసీస్ ‘ఎ’ పరాజయం
సిరీస్ భారత్ ‘ఎ’ వశం
కాన్పూర్: ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు మ్యాచ్‌ల అనధికార వన్డే సిరీ్‌సను భారత్ ‘ఎ’ 2-1తో దక్కించుకుంది. ఆదివారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ రెండు వికెట్లతో నెగ్గింది. తొలుత ఆస్ట్రేలియా ‘ఎ’ 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. ఎడ్వర్డ్స్ (89), స్కాట్ (73), కొనొలీ (64) అర్ధ శతకాలు సాధించారు. అర్ష్‌దీప్, హర్షిత్ చెరో మూడేసి, బదోని రెండు వికెట్లు పడగొట్టారు. భారీ ఛేదనలో భారత్ ‘ఎ’ 46 ఓవర్లలో 322/8 స్కోరు చేసి గెలుపొందింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (102) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శ్రేయాస్ (62), పరాగ్ (62) హాఫ్ సెంచరీలో సత్తా చాటారు. చివర్లో వరుస వికెట్లు కోల్పోయి భారత్ ‘ఎ’ ఇబ్బందులో పడినా అర్ష్‌దీప్ (7 బ్యాటింగ్) అండగా విప్రాజ్ నిగమ్ (24 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘా చెరో 4 వికెట్లు తీశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు