Share News

PM Modi Praises: నీ బ్యాటింగ్‌ టెస్ట్‌ క్రికెట్‌కు అందం

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:22 AM

టెస్ట్‌ క్రికెట్‌ సొబగు చటేశ్వర్‌ పుజార బ్యాటింగ్‌తో మరింత గుభాళించిందని ప్రధాని మోదీ కొనియాడారు. అతడి బ్యాటింగ్‌ శైలి సుదీర్ఘ ఫార్మాట్‌ అందానికి అద్దం పడుతుందని ప్రశంసించారు. ఇటీవల టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌...

PM Modi Praises: నీ బ్యాటింగ్‌ టెస్ట్‌ క్రికెట్‌కు అందం

  • పుజారపై ప్రధాని ప్రశంసలు

న్యూఢిల్లీ: టెస్ట్‌ క్రికెట్‌ సొబగు చటేశ్వర్‌ పుజార బ్యాటింగ్‌తో మరింత గుభాళించిందని ప్రధాని మోదీ కొనియాడారు. అతడి బ్యాటింగ్‌ శైలి సుదీర్ఘ ఫార్మాట్‌ అందానికి అద్దం పడుతుందని ప్రశంసించారు. ఇటీవల టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సౌరాష్ట్ర ఆటగాడికి ప్రధాని లేఖ రాశారు. ‘పొట్టి క్రికెట్‌ ఆధిపత్యం చెలాయిస్తున్న కాలంలో..సుదీర్ఘ ఫార్మాట్‌ ఆట అందం ఎలా ఉంటుందో చెప్పేందుకు నువ్వే తార్కాణం. వెన్ను చూపని నీ తత్త్వం, గొప్ప సంకల్పంతో గంటలకొద్దీ బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యంతో భారత బ్యాటింగ్‌కు అండగా నిలిచావు’ అని ఆ లేఖలో ప్రధాని పొగిడారు. ఈమేరకు మోదీ పంపిన లేఖను పుజార ఆదివారంనాడు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌‌పై హరీష్‌రావు ఫైర్

Updated Date - Sep 01 , 2025 | 02:22 AM