Share News

US Open Mixed Doubles: సెమీస్ లో జెస్సికా జోడీ

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:49 AM

యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ చాంపియన్‌షి్‌పలో టాప్‌ సీడ్‌ జెస్సికా పెగుల, డేనియల్‌ కొలిన్స్‌ జోడీలు సెమీ్‌సకు చేరుకొన్నాయి. క్వార్టర్స్‌లో అమెరికా-బ్రిటన్‌ జంట పెగుల-జాక్‌ డ్రేపర్‌ 4-1, 4-1తో ఆండ్రీవ-మెద్వెదెవ్‌ జంటపై...

US Open Mixed Doubles: సెమీస్ లో జెస్సికా జోడీ

కొలిన్స్‌ జంట కూడా

  • అల్కారజ్‌, జొకో ద్వయాలకు నిరాశ

  • యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ చాంపియన్‌షి్‌పలో టాప్‌ సీడ్‌ జెస్సికా పెగుల, డేనియల్‌ కొలిన్స్‌ జోడీలు సెమీ్‌సకు చేరుకొన్నాయి. క్వార్టర్స్‌లో అమెరికా-బ్రిటన్‌ జంట పెగుల-జాక్‌ డ్రేపర్‌ 4-1, 4-1తో ఆండ్రీవ-మెద్వెదెవ్‌ జంటపై గెలిచింది. అమెరికా జోడీల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో కొలిన్స్‌-క్రిస్టియన్‌ హ్యారిసన్‌ 4-1, 5-4(2)తో టేలర్‌ టౌన్‌సెండ్‌-షెల్టన్‌పై గెలిచి ఫైనల్‌-4కు అర్హత సాధించింది. సెమీ్‌సలో మూడో సీడ్‌ ఇగా స్వియటెక్‌-కాస్పర్‌ రూడ్‌తో జెస్సికా పెగుల జంట, డిఫెండింగ్‌ చాంప్‌ సారా ఎరాని-ఆండ్రియా వవస్సోరి జోడీతో కొలిన్స్‌-హ్యారిసన్‌ ద్వయం అమీతుమీ తేల్చుకోనుంది.

రదుకాను జంటకు షాక్‌..: భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఎమ్మా రదుకాను-కార్లోస్‌ అల్కారజ్‌ జంటకు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. బ్రిటన్‌-స్పెయిన్‌ జోడీ రదుకాను-అల్కారజ్‌ 2-4, 2-4తో టాప్‌ సీడ్‌ పెగుల-డ్రేపర్‌ చేతిలో, సెర్బియా జోడీ జొకోవిచ్‌-ఓల్గా డానిలోవిచ్‌ 2-4, 3-5తో మిర్రా ఆండ్రీవ-డానిల్‌ మెద్వెదెవ్‌ చేతిలో ఓడింది. జ్వెరెవ్‌-బెలిండా బెనిసిక్‌ 0-4, 3-5తో కొలిన్స్‌-హ్యారిసన్‌ చేతిలో చిత్తయింది.

హగ్‌కు నో: మ్యాచ్‌ ముగిసిన తర్వాత బ్రిటన్‌ ప్లేయర్‌ డ్రేపర్‌కు రదుకాను హగ్‌ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. డ్రేపర్‌ హగ్‌ ఇవ్వడానికి ప్రయత్నించినా.. రదుకాను ఇష్టం లేననట్టుగా తప్పుకొంది. రదుకాను ఎందుకు ఇలా వ్యవహరించిందనేది ఎవరికీ అర్థం కాలేదు. అయితే, మ్యాచ్‌లో డ్రేపర్‌ తనను లక్ష్యంగా చేసుకొని ఆడడంపై రదుకాను కినుక వహించినట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం

India Women Cricket: ప్రపంచకప్‌ జట్టులో శ్రీచరణి

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2025 | 03:49 AM