Pant Expresses Frustration: టెస్టు మ్యాచ్ జోక్ అనుకున్నారా
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:55 AM
రెండో రోజు ఆటలో ఓవర్ వేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో స్పిన్నర్ కుల్దీప్‌పై తాత్కాలిక కెప్టెన్ పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పటికే అంపైర్ రెండుసార్లు...
రెండో రోజు ఆటలో ఓవర్ వేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో స్పిన్నర్ కుల్దీప్‌పై తాత్కాలిక కెప్టెన్ పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పటికే అంపైర్ రెండుసార్లు హెచ్చరించాడు. మూడోసారి ఇదే రిపీట్ అయితే జట్టుపై 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. దీంతో పంత్ ఘాటుగా స్పంది స్తూ.. ‘30 సెకన్ల టైమర్ ఆన్‌లో ఉంది. ఇంట్లో ఆడుతున్నావా? బంతి త్వరగా వెయ్’ అని కుల్దీ్‌పకు సూచించాడు. ఇతర ఆటగాళ్లు కూడా ఓవర్ ముగిశాక నెమ్మదిగా కదులుతుండడంతో అసంతృప్తి చెందాడు. ‘కుల్దీ్‌పను రెండుసార్లు హెచ్చరించారు. మీరు కదిలేందుకు పూర్తి ఓవర్ కావాలా? మీరంతా టెస్టు క్రికెట్‌ను జోక్‌గా భావిస్తున్నారు’ అని పంత్ వారిపై కోపగించుకున్నాడు.
ఇవీ చదవండి: