Asia Cup Cricket 2025: పాక్ శుభారంభం
ABN , Publish Date - Sep 13 , 2025 | 02:43 AM
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మహ్మద్ హరీస్...
ఆసియా కప్‌లో నేడు
బంగ్లాదేశ్ X శ్రీలంక
రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
ఒమన్‌పై ఘనవిజయం
దుబాయ్: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మహ్మద్ హరీస్ (43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ ఆరంభంలో తడబడినా.. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు సాధించింది. ఓపెనర్ సహిబ్జాద ఫర్హాన్ (29), ఫఖర్ జమాన్ (23 నాటౌట్), మహ్మద్ నవాజ్ (19) ఫర్వాలేదనిపించారు. పేసర్ షా ఫైజల్, స్పిన్నర్ ఆమిర్ కలీమ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో పాక్ బౌలర్ల ధాటికి ఒమన్ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో ఆ జట్టు 16.4 ఓవర్లలో 67 పరుగులే చేసి చిత్తుగా ఓడింది. 10 పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లు కోల్పోవడం గమనార్హం. హమ్మద్ మీర్జా (27) ఒక్కడే కాస్త పోరాడాడు. స్పిన్నర్లు సుఫియాన్, సయీమ్ అయూబ్‌లతో పాటు పేసర్ ఫహీమ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 20 ఓవర్లలో 160/7 (మహ్మద్ హరీస్ 66, ఫర్హాన్ 29, ఫఖర్ 23; కలీమ్ 3/31, ఫైజల్ 3/34).
ఒమన్: 16.4 ఓవర్లలో 67 ఆలౌట్. (హమ్మద్ 27; ఫహీమ్ 2/6, సుఫియాన్ 2/7, సయీమ్ అయూబ్ 2/8).
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి