Sricharani Emerges as Bowling Sensation: మన చరణి తిప్పేసింది
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:09 AM
రాయలసీమలోని కడప జిల్లా, యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి క్రికెట్ ప్రయాణం రాకెట్‌లా దూసుకెళ్తోంది. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్‌తో మొదలై వన్డే ప్రపంచకప్ వరకు...
రాయలసీమలోని కడప జిల్లా, యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి క్రికెట్ ప్రయాణం రాకెట్‌లా దూసుకెళ్తోంది. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్‌తో మొదలై వన్డే ప్రపంచకప్ వరకు వరుస పెట్టి అవకాశాలు దక్కించుకుంటూ ప్రతి సందర్భంలోనూ తన ఎంపిక సరైనదేనని నిరూపించుకుంది ఈ తెలుగమ్మాయి. ప్రపంచక్‌పలో చరణి మొత్తం తొమ్మిది మ్యాచ్‌లాడి 14 వికెట్లు పడగొట్టింది. మొత్తంగా 4.96 ఎకానమీతో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది. వరల్డ్‌క్‌పలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో దీప్తి శర్మ 22 వికెట్లతో (5.52 ఎకానమీ) అగ్రస్థానం దక్కించుకోగా, చరణి నాలుగో స్థానంలో నిలిచింది.
సీనియర్లకు దీటుగా..: విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 331 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లందరూ విఫలమైన చోట చరణి తన దమ్ము చూపించింది. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన ఫైనల్లో కూడా దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్‌తో సహా టాపార్డర్ బ్యాటర్లంతా చరణి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డారు.

పూజలు ఫలించాయి..
దేశానికి తొలి మహిళల వరల్డ్‌కప్ అందించిన భారత జట్టులో మా అమ్మాయి సభ్యురాలిగా ఉండడం మా అదృష్టం. మేము చేసిన పూజలు ఫలించాయి. ఈ ప్రపంచక్‌పలో చరణి ఆట తీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. దేశం మొత్తం మా బిడ్డను పొగుడుతుంటే ఆనందంగా ఉంది.
చంద్రశేఖర్ రెడ్డి (శ్రీచరణి తండ్రి)
(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్)
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!
Read Latest AP News And Telugu News