Ranji Trophy 2025: ఫాలోఆన్‌లో ఒడిశా
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:51 AM
ఆంధ్రతో గ్రూప్ ‘ఎ’ రంజీట్రోఫీ మ్యాచ్‌లో ఒడిశా ఫాలోఆన్‌లో పడింది. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో సోమవారం ఆట ముగిసే సరికి ఆతిథ్య జట్టు రెండు వికెట్లకు 190 పరుగుల స్కోరుతో...
ఆంధ్రతో రంజీట్రోఫీ
కటక్: ఆంధ్రతో గ్రూప్ ‘ఎ’ రంజీట్రోఫీ మ్యాచ్‌లో ఒడిశా ఫాలోఆన్‌లో పడింది. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో సోమవారం ఆట ముగిసే సరికి ఆతిథ్య జట్టు రెండు వికెట్లకు 190 పరుగుల స్కోరుతో పోరాడుతోంది. గౌరవ్ చౌధురి (79), గోవింద్ (4) క్రీజులో ఉన్నాడు. సందీప్ పట్నాయక్ (63), స్వస్తిక్ (36) అవుటయ్యారు. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఒడిశా ఇంకా 134 పరుగులు వెనుకంజలో నిలిచింది. అంతకుముందు 80/4తో మూడోరోజు మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఒడిశా 151 రన్స్‌కు ఆలౌటైంది. విజయ్, సాయితేజ, సౌరబ్ తలా మూడేసి వికెట్లు తీశారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 475/7 స్కోరుతో డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!
Read Latest AP News And Telugu News