Novak Djokovic: రికార్డు సృష్టించిన నోవాక్ జకోవిచ్
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:04 PM
ఏథెన్స్‌లో జరిగిన హెల్లెనిక్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో లొరెంజో ముసెట్టిని ఓడించి తన కెరీర్‌లో 101వ ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టైటిల్ గెలుపు జకోవిచ్‌కు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు.. టెన్నిస్ ప్రపంచంలో ఓ మైలురాయిగా నిలిచింది. ఇది జకోవిచ్ కెరీర్‌లో 72వ హార్డ్ కోర్ట్ టైటిల్ కావడం గమన్హారం.
సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్(Novak Djokovic) టెన్నిస్ చరిత్రలో ఓ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. ఏథెన్స్‌లో జరిగిన హెల్లెనిక్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో లొరెంజో ముసెట్టి(Lorenzo Musetti)ని ఓడించి తన కెరీర్‌లో 101వ ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టైటిల్ గెలుపు జకోవిచ్‌కు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు.. టెన్నిస్ ప్రపంచంలో ఓ మైలురాయిగా నిలిచింది. ఇది జకోవిచ్ కెరీర్‌లో 72వ హార్డ్ కోర్ట్ టైటిల్ కావడం గమన్హారం. అంతకుముందు స్విట్జర్లాండ్‌కు చెందిన లెజెండ్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ పేరిట అత్యధికంగా 71 హార్డ్ కోర్ట్ టైటిల్స్ రికార్డు ఉండేది. తాజా విజయంతో జకోవిచ్.. ఫెదరర్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాక ప్రపంచంలోనే ఎక్కువ టైటిల్స్ తన ఖాతాలు వేసుకున్న తొలి ప్లేయర్ గా జకోవిచ్ రికార్డు సృష్టించాడు.
హెల్లెనిక్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో లొరెంజో ముసెట్టి గట్టి పోటీ ఇచ్చాడు. జకోవిచ్‌కు(Novak Djokovic) అంత సులభంగా విజయం దక్కలేదు. ఇరువురి మధ్య మూడు సెట్ల పాటు హోరాహోరీగా మ్యాచ్ సాగింది. ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో జకోవిచ్ తన అనుభవాన్ని, పట్టుదలను ప్రదర్శించి విజయం సాధించాడు. తొలి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన జకోవిచ్(Novak Djokovic), రెండో సెట్‌లో 6-3తో పుంజుకున్నాడు. నిర్ణయాత్మకమైన చివరి సెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ నడిచింది. ఈ సెట్‌లో రెండుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయినప్పటికీ జకోవిచ్ చివరికి తన పట్టుదలతో 7-5 తేడాతో సెట్‌ను, టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ATP టైటిల్ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా కూడా జకోవిచ్(38 ఏళ్ల 5 నెలలు) నిలిచాడు. 1977లో కెన్ రోస్‌వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి జకోవిచ్ కావడం విశేషం.
అత్యధిక హార్డ్ కోర్ట్ టైటిల్స్:
*నొవాక్ జకోవిచ్-72
*రోజర్ ఫెదరర్-71
*ఆండ్రీ అగస్సీ-46
ఇవి కూడా చదవండి:
‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఎవరంటే?
ఫామ్‌లో ధ్రువ్ జురెల్.. నితీశ్‌పై వేటు?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి