Nitish Kumar Injury: టెస్టు సిరీస్ కు నితీశ్ దూరం
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:24 AM
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఆరంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ మోకాలి గాయం కారణంగా మిగిలిన రెండు టెస్టులకు...
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఆరంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ మోకాలి గాయం కారణంగా మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది. ఆదివారం అతడు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా మోకాలికి గాయమైంది. స్కానింగ్‌లో లిగమెంట్ దెబ్బతిన్నట్టు తేలడంతో సిరీస్‌లో అతడు ఆడేది సందేహంగా మారింది. అయితే నితీశ్ గాయంపై బీసీసీఐ అఽధికారికంగా ప్రకటించలేదు. తొలి టెస్టులో ఆడని నితీశ్‌కు ఆ తర్వాత రెండు టెస్టుల్లో చోటు కల్పించారు. అయితే లార్డ్స్ టెస్టులో 3 వికెట్లు, 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి