నిషిక తీన్మార్
ABN , Publish Date - May 15 , 2025 | 05:09 AM
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో బుధవారం తెలంగాణ క్రీడాకారులు ఆరు పతకాలు కొల్లగొట్టారు. బిహార్‌లో జరిగిన జూనియర్ జిమ్నాస్టిక్స్ వాల్టింగ్ టేబుల్‌లో నిషిక అగర్వాల్ పసిడి....
రిషిత, లక్ష్మికి చెరో రెండు పతకాలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో బుధవారం తెలంగాణ క్రీడాకారులు ఆరు పతకాలు కొల్లగొట్టారు. బిహార్‌లో జరిగిన జూనియర్ జిమ్నాస్టిక్స్ వాల్టింగ్ టేబుల్‌లో నిషిక అగర్వాల్ పసిడి పతకం నెగ్గింది. అలాగే అన్‌ఈవెన్ బార్స్, బ్యాలెన్సింగ్ బీమ్‌లో ఒక్కో కాంస్యం సొంతం చేసుకుంది. టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో బసిరెడ్డి రిషిత రెడ్డి 6-1, 2-6, 6-3తో ఐశ్వర్యపై నెగ్గి స్వర్ణంతో మెరిసింది. దండు లక్ష్మీ సిరి 6-4, 6-1తో హర్షిణిపై గెలిచి కాంస్యం అందుకుంది. డబుల్స్ ఫైనల్లో తెలంగాణ ద్వయం రిషిత-లక్ష్మీ సిరి 0-6, 4-6తో ఆకృతి-ఐశ్వర్య చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్ర అమ్మాయి రామలక్ష్మి రజతంతో మెరిసింది.
ఇవీ చదవండి:
కోహ్లీ రిటైర్‌మెంట్.. అనుష్క ఎమోషనల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి