Share News

Asian Gymnastics Championship: ఆసియా జిమ్నాస్టిక్స్‌కు నిషిక

ABN , Publish Date - May 03 , 2025 | 04:11 AM

జాతీయ సీనియర్‌ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన నిషిక ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత పొందింది. ఆమె 43.750 స్కోరుతో ద్వితీయ స్థానం పొందింది.

 Asian Gymnastics Championship: ఆసియా జిమ్నాస్టిక్స్‌కు నిషిక

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సీనియర్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఆల్‌రౌండ్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి నిషిక అగర్వాల్‌ రజతంతో మెరిసింది. ఈ పతకంతో ఆసియా జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షి్‌పకు కూడా నిషిక అర్హత సాధించింది. శుక్రవారం పుణెలో జరిగిన ఈ పోటీల్లో నిషిక 43.750 స్కోరుతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆసియా చాంపియన్‌షి్‌ప వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ మధ్య కొరియాలో జరగనుంది.

Updated Date - May 03 , 2025 | 04:13 AM