Asian U19 Boxing Championship: నిషా ముస్కాన్ రాహుల్ పసిడి పంచ్
ABN , Publish Date - Aug 11 , 2025 | 05:55 AM
ఆసియా అండర్-19 చాంపియన్‌షిప్‌లో ఆదివారం ముగ్గురు భారత బాక్సర్లు స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. మహిళల 54 కి. విభాగంలో ఫైనల్లో నిషా 4-1తో సిరు యాంగ్ (చైనా)ను చిత్తు చేసి పసిడి పతకం దక్కించుకుంది...
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప
బ్యాంకాక్ : ఆసియా అండర్-19 చాంపియన్‌షిప్‌లో ఆదివారం ముగ్గురు భారత బాక్సర్లు స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. మహిళల 54 కి. విభాగంలో ఫైనల్లో నిషా 4-1తో సిరు యాంగ్ (చైనా)ను చిత్తు చేసి పసిడి పతకం దక్కించుకుంది. మహిళల 57 కి. కేటగిరీ తుదిపోరులో ముస్కాన్ 3-2తో అయజన్ ఎర్మెక్ (కజకిస్థాన్)ను ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల 75 కి. టైటిల్ ఫైట్‌లో రాహుల్ కుందు 4-1తో మహ్మదన్ (ఉజ్బెకిస్థాన్)పై గెలిచి బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. మౌసమ్ సుహాగ్ (65 కి.), హేమంత్ సంగ్వాన్ (90 కి.) అంతిమ పోరులో పరాజయంతో రజత పతకాలు అందుకున్నారు. అండర్-19 విభాగంలో భారత్ మొత్తం 14 (3-7-4) పతకాలతో అదరగొట్టింది. బరిలోకి దిగిన 10 మంది మహిళా బాక్సర్లలో తొమ్మిదిమంది పతకాలు గెలుపొందడం విశేషం. ఇందులో రెండు స్వర్ణ, ఐదు రజత, రెండు కాంస్య పతకాలున్నాయి. అండర్-22 విభాగంలో భారత్ 13 పతకాలు ఖాయం చేసుకుంది. సోమవారం జరిగే ఫైనల్స్‌లో మనోళ్లు ఐదుగురు తలపడనున్నారు. అండర్-19, అండర్-22 కేటగిరీల్లో భారత్ తరపున మొత్తం 40 మంది బాక్సర్లు బరిలో నిలిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News