World Boxing Cup: ఫైనల్లో నిఖత్
ABN , Publish Date - Nov 20 , 2025 | 06:33 AM
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తెలుగమ్మాయి నిఖత్ జరీన్ 21 నెలల అనంతరం తొలి అంతర్జాతీయ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఈ తెలంగాణ స్టార్ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 51 కిలోల విభాగంలో టైటిల్ ఫైట్‌కు...
ప్రపంచ బాక్సింగ్ కప్
గ్రేటర్ నోయిడా: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తెలుగమ్మాయి నిఖత్ జరీన్ 21 నెలల అనంతరం తొలి అంతర్జాతీయ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఈ తెలంగాణ స్టార్ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 51 కిలోల విభాగంలో టైటిల్ ఫైట్‌కు దూసుకెళ్లింది. బుధవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో నిఖత్ 5-0తో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ జెనీవా గుల్సెవార్‌ను చిత్తుచేసింది. ఈ ప్రదర్శనతో కనీసం రజతాన్ని ఖాయం చేసుకున్న నిఖత్.. స్వర్ణం కోసం చైనీస్ తైపీకి చెందిన గువా యి గ్జువాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 29 ఏళ్ల నిఖత్ చివరిగా గతేడాది ఫిబ్రవరిలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో పతకం సాధించింది. ఇక, ప్రపంచ బాక్సింగ్ కప్‌లో నిఖత్‌తో పాటు మిగతా భారత బాక్సర్లు జాస్మిన్ లంబోరియా (57 కిలోలు), జాదూమణి సింగ్ (50 కిలోలు), పవన్ బర్త్వాల్ (55 కి), సచిన్ సివాచ్ (60 కి), హితేశ్ గులియా (70 కి) తమ విభాగాల్లో ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ చేరారు. ఓవరాల్‌గా 15 మంది భారత బాక్సర్లు గురువారం జరిగే ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు.
ఇవి కూడా చదవండి:
Venkatesh Iyer T20 XI: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లి దక్కని చోటు!
IND VS SA: ఘోరంగా విఫలమైన అభిషేక్, తిలక్, రుతురాజ్.. భారత్ ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి