Share News

Women Cricket News: ఆసీస్‌ ఎ క్లీన్‌స్వీ్‌ప

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:38 AM

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ ‘ఎ’ మహిళల జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఆదివారం జరిగిన అనధికార మూడో టీ20లోనూ నాలుగు పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఆసీస్‌ మహిళల ‘ఎ’ జట్టు...

Women Cricket News: ఆసీస్‌ ఎ క్లీన్‌స్వీ్‌ప

0-3తో భారత్‌ ‘ఎ’ చిత్తు

మెకే (ఆసీస్‌): ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ ‘ఎ’ మహిళల జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఆదివారం జరిగిన అనధికార మూడో టీ20లోనూ నాలుగు పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఆసీస్‌ మహిళల ‘ఎ’ జట్టు ఈ సిరీ్‌సను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. మెడెలిన్‌ పెన్నా (39), అలీసా హీలీ (27) రాణించారు. స్పిన్నర్లు ప్రేమ రావత్‌, రాధా యాదవ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత మహిళలు 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేశారు. ఓపెనర్‌ షఫాలీ (41), మిన్ను మణి (30), రఘ్వీ బిస్త్‌ (25) ఫర్వాలేదనిపించారు. సియానా జింజర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:38 AM