Share News

సెమీ్‌సలో ముంబైగీవిదర్భ

ABN , Publish Date - Feb 12 , 2025 | 02:47 AM

డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై, గతేడాది రన్నరప్‌ విదర్భతోపాటు గుజరాత్‌ రంజీ ట్రోఫీ సెమీ్‌సకు దూసుకెళ్లాయి. కెప్టెన్‌ రహానె (108) సెంచరీతో అదరగొట్టగా.. పేసర్‌ రాయ్‌స్టన్‌ డయాస్‌ (5/39) ప్రత్యర్థి వెన్ను విరవడంతో...

సెమీ్‌సలో ముంబైగీవిదర్భ

గుజరాత్‌ కూడా..

రంజీ ట్రోఫీ

కోల్‌కతా: డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై, గతేడాది రన్నరప్‌ విదర్భతోపాటు గుజరాత్‌ రంజీ ట్రోఫీ సెమీ్‌సకు దూసుకెళ్లాయి. కెప్టెన్‌ రహానె (108) సెంచరీతో అదరగొట్టగా.. పేసర్‌ రాయ్‌స్టన్‌ డయాస్‌ (5/39) ప్రత్యర్థి వెన్ను విరవడంతో.. హరి యాణాతో క్వార్టర్స్‌లో ముంబై 152 పరుగుల తేడాతో గెలిచింది. ఆటకు నాలుగోరోజైన మంగళవారం ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటై, 354 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. ఛేదనలో హరియాణా 201 రన్స్‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 315, హరియాణా 301 పరుగులు చేశాయి.


తమిళనాడు ఘోర ఓటమి: మరో క్వార్టర్స్‌లో విదర్భ 198 రన్స్‌తో తమిళనాడును చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 272 పరుగులు చేసిన విదర్భ ప్రత్యర్థి ముందు 401 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. యశ్‌ రాథోడ్‌ (112) సెంచరీ చేశాడు. ఛేదనలో తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 202 రన్స్‌కే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 353, తమిళనాడు 225 రన్స్‌ చేశాయి. ఈనెల 17 నుంచి జరిగే సెమీస్‌లో ముంబైతో విదర్భ తలపడనుంది.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌ విజయం: మరో క్వార్టర్స్‌లో గుజరాత్‌ జట్టు ఇన్నింగ్స్‌ 98 పరుగుల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది.


ఇవీ చదవండి:

రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్

కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి

సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 12 , 2025 | 02:47 AM