Share News

పట్టుబిగించిన విదర్భ

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:29 AM

విదర్భతో రంజీ సెమీస్‌ మ్యాచ్‌లో ముంబై ఎదురీదుతోంది. 406 పరుగుల లక్ష్య ఛేదనలో.. గురువారం రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 83/3 స్కోరు చేసింది. విజయానికి ముంబై ఇంకా 323 పరుగుల...

పట్టుబిగించిన విదర్భ

  • ముంబై లక్ష్యం 406

  • ప్రస్తుతం 83/3

  • రంజీ సెమీస్‌

నాగ్‌పూర్‌: విదర్భతో రంజీ సెమీస్‌ మ్యాచ్‌లో ముంబై ఎదురీదుతోంది. 406 పరుగుల లక్ష్య ఛేదనలో.. గురువారం రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 83/3 స్కోరు చేసింది. విజయానికి ముంబై ఇంకా 323 పరుగుల దూరంలో ఉంది. ఓవర్‌నైట్‌ స్కోరు 147/4తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విదర్భ 292 పరుగులకు ఆలౌటైంది. యశ్‌ రాథోడ్‌ (151) సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 383, ముంబై 207 పరుగులు సాధించాయి. కేరళతో రంజీ సెమీ్‌సలో గుజరాత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంపై కన్నేసింది. ఆటకు నాలుగో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 222/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన గుజరాత్‌ 429/7 చేసింది. కేరళ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 457కు గుజరాత్‌ ఇంకా 28 పరుగుల దూరంలో ఉంది. ఒక్క పరుగు ఆధిక్యం లభించినా గుజరాత్‌ తుది పోరుకు అర్హత సాధిస్తుంది.


ఇవీ చదవండి:

చరిత్ర తిరగరాసిన రోహిత్

షమి తుఫాను.. 4 రికార్డులు బ్రేక్

అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2025 | 04:33 AM