Share News

Mohammed Kaif: ఇది నిజంగా అన్యాయం.. గిల్, గంభీర్‌పై కైఫ్ విమర్శలు

ABN , Publish Date - Oct 24 , 2025 | 08:17 PM

అడిలైడ్ మ్యాచ్‌కు కుల్‌దీప్ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడం నిజంగా అన్యాయమని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. హర్షిత్ లేదా నితీశ్ రెడ్డిలల్లో ఎవరో ఒకరినే ఎంపిక చేయాలని సూచించాడు.

Mohammed Kaif: ఇది నిజంగా అన్యాయం.. గిల్, గంభీర్‌పై కైఫ్ విమర్శలు
Mohammad Kaif on India loss

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో కూడా టీమిండియా ఓటమి చవిచూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జట్టు కూర్పుపై అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టులోకి కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. హర్షిత్ రాణా, నితీశ్‌లల్లో ఎవరో ఒక్కరినే జట్టులోకి తీసుకుంటే సరిపోతుందని అన్నాడు.

‘హర్షిత్ రాణాను నేను జాగ్రత్తగా పరిశీలిస్తున్నా. అతడికి తనదైన ప్రత్యేకత ఏమీ లేదు. అద్భుతమైన ఔట్‌స్వింగర్ లేదా ఇన్‌స్వింగర్‌లు వంటివి అతడు ఇప్పటివరకూ వేయలేదు. సిరాజ్, బుమ్రా లాంటి వాళ్లకు యోర్కర్లు, పేస్, స్లో బంతులను అద్భుతంగా వేయగలరు. అది వారి ప్రత్యేకత. కానీ హర్షిత్ ప్రత్యేకత ఏమిటనేదానిపై నాకు ఇంకా స్పష్టత లేదు. కాబట్టి, జట్టులోని రాణా లేదా రెడ్డిని తీసుకోవాలి. ఇద్దరూ అవసరం లేదు. ఇక కుల్‌దీప్‌ను ఎంపిక చేయకపోవడం నిజంగా అన్యాయం’ అని అన్నాడు.


‘ప్రత్యర్థి జట్టుకు 9 లేదా 10 పరుగుల రన్ రేట్ అవసరమైనప్పుడు హర్షిత్ లాంటి వాళ్లు ప్రభావం చూపగలుగుతారు. పేస్‌లో మార్పు చేయగలగడం అతడి బలం. కానీ ప్రత్యర్థి బ్యాటర్లు టెస్టు క్రికెట్‌లో ఆడినట్టు వన్డేల్లో ఆడుతుంటే.. రన్‌రేట్ జస్ట్ 5 లేదా 6గా మాత్రమే ఉంటే అప్పుడు బౌలర్‌ మరింత తెలివిగా వ్యూహాలు పన్నాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆడమ్ జంపా లాంటి వాళ్లు కావాలి’ అని అన్నారు.

భారత్‌తో మ్యాచ్‌లో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీసిన విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. అడిలైడ్‌లో కుల్‌దీప్‌ను రంగంలోకి దింపి ఉంటే ఇలాగే మ్యాచ్‌ను మలుపు తిప్పి ఉండేవాడని కైఫ్ అన్నాడు. అడిలైడ్ వన్డేలో గెలవడంతో ఈ సిరీస్ కంగారూల సొంతమైన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

సిడ్నీలో అదే జరిగితే.. విరాట్ పేరిట చెత్త రికార్డు

రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్లాన్ చెప్పేసిన గంభీర్..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 24 , 2025 | 08:23 PM