Lionel Messis Flight: ఈ ఫ్లైట్ యమ కాస్ట్‌లీ
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:41 AM
మెస్సీలాంటి దిగ్గజ ఆటగాడు వ్యక్తిగత పర్యటనల్లో సాధారణ విమానాల్లో ప్రయాణించడు. భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక విమానాల్లోనే అతడి పర్యటనలుంటాయి. అదే క్రమంలో భారత్ టూర్‌కు కూడా...
మెస్సీలాంటి దిగ్గజ ఆటగాడు వ్యక్తిగత పర్యటనల్లో సాధారణ విమానాల్లో ప్రయాణించడు. భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక విమానాల్లోనే అతడి పర్యటనలుంటాయి. అదే క్రమంలో భారత్ టూర్‌కు కూడా మెస్సీ ప్రత్యేక విమానంలో విచ్చేశాడు. అత్యంత అధునాతన సదుపాయాలున్న ఆ ఫ్లైట్ వివరాలు ఎంతో ఆసక్తికరం. ‘గల్ఫ్‌స్ర్టీమ్ వి’ (జీవీ) అనే బిజినెస్ జెట్‌లో లియోనెల్ పర్యటన సాగుతోంది. అమెరికాకు చెందిన గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ ఈ బిజినెస్ జెట్‌ల తయారీలో ప్రసిద్ధి చెందింది. 96.42 అడుగుల పొడవు, 25.83 అడుగుల ఎత్తు ఉండే ఈ జెట్ గంటకు 940 కి.మీ. వేగంతో దూసుకుపోతూ ఏకధాటిగా 12 వేల కి.మీ. ప్రయాణించగలదు. అంటే..న్యూయార్క్ నుంచి టోక్యో, లండన్ నుంచి సింగపూర్‌కు అలవోకగా చేరుకోవచ్చు. 51 వేల అడుగుల ఎత్తులో ఇది ప్రయాణిస్తుంది. సాధారణ విమానాలు 31 వేల అడుగుల ఎత్తులోనే వెళతాయి. అందువల్ల జీవీ జెట్‌లకు సాధారణ ఎయిర్ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. 14 నుంచి 16 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానం ఖరీదు రూ. 362 కోట్ల పైమాటే. ఏడాది నిర్వహణ ఖర్చు రూ. 36 కోట్లు అవుతుందట. ఇక..ఈ విమానం గంట అద్దె దాదాపు రూ.10 లక్షలు ఉంటుంది.
ఇవీ చదవండి: