Messi Unveils 70 Foot Statue in Kolkata: 70 అడుగుల విగ్రహం
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:43 AM
మెస్సీ.. మెస్సీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే నామస్మరణ. ది గోట్ టూర్‌లో భాగంగా భారత్‌లో అడుగుపెట్టిన అర్జెంటీనా సూపర్ స్టార్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు...
మెస్సీ.. మెస్సీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే నామస్మరణ. ది గోట్ టూర్‌లో భాగంగా భారత్‌లో అడుగుపెట్టిన అర్జెంటీనా సూపర్ స్టార్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ జట్టు సభ్యులైన లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా విచ్చేశారు. అతని రాకతో కోల్‌కతా నగరం సాకర్ సిటీని తలపించింది. ఎక్కడ చూసినా మెస్సీ కటౌట్‌లే దర్శనమిచ్చాయి. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ.. కోల్‌కతా లేక్‌టౌన్‌లోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన 70 అడుగుల తన విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో మెస్సీతో పాటు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ పాల్గొన్నాడు. ఇంత భారీస్థాయిలో మెస్సీ విగ్రహం ప్రపంచంలోనే మరెక్కడా లేకపోవడం విశేషం.
ఇవీ చదవండి: