Share News

Messi India Tour: మెస్సీ మేనియ

ABN , Publish Date - Dec 09 , 2025 | 05:55 AM

సుదీర్ఘ కాలం తర్వాత సాకర్‌ స్టార్‌ మెస్సీ భారత్‌ రానుండడంతో.. దేశాన్ని ఫుట్‌బాల్‌ ఫీవర్‌ ఆవహించింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా నాలుగు ప్రముఖ నగరాల్లో....

Messi India Tour: మెస్సీ మేనియ

సుదీర్ఘ కాలం తర్వాత సాకర్‌ స్టార్‌ మెస్సీ భారత్‌ రానుండడంతో.. దేశాన్ని ఫుట్‌బాల్‌ ఫీవర్‌ ఆవహించింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా నాలుగు ప్రముఖ నగరాల్లో అర్జెంటీనా దిగ్గజం ఫ్యాన్స్‌కు కనువిందు చేయనున్నాడు. ముఖ్యంగా గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ ఆటగాడి టూర్‌లో ఈసారి హైదరాబాద్‌ భాగం కావడంతో భాగ్యనగరంలో ముందుగానే సందడి వాతావరణం నెలకొంది.

అర్జెంటీనా సాకర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ భారత పర్యటనకు రానుండడంతో సాకర్‌ ఫ్యాన్స్‌ జోష్‌ పెరిగింది. ఎప్పుడెప్పుడు తమ ఆరాధ్య ఆటగాడిని చూస్తామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మూడు రోజుల టూర్‌లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి కోల్‌కతాకు చేరుకోనున్నాడు. శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగే కార్యక్రమం తర్వాత.. సాయంత్రం ఉప్పల్‌లో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌కు లియోనెల్‌ హాజరుకానున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా మెస్సీతో కలసి ఫుట్‌బాల్‌ ఆడనుండడంతో ఒక్కసారిగా హైప్‌ పెరిగింది. హైదరాబాద్‌ తర్వాత ముంబై, ఢిల్లీలకు మెస్సీ వెళ్లనున్నాడు.

అప్పుడలా..

మెస్సీ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. 2011లో కోల్‌కతాలో వెనిజులాతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు పాల్గొంది. ఈ పోరులో అర్జెంటీనా 1-0తో వెనిజులాపై గెలిచింది. సాల్ట్‌లేక్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు 70వేల మంది తరలివచ్చారు.

2011లో..

షారుక్‌, గంగూలీలతో..

మెస్సీ పర్యటన కోల్‌కతా నుంచి ఆరంభం కానుంది. ఉదయం 10.30 నుంచి సుమారు మూడు గంటలు మెస్సీ ఇక్కడ ఉండనున్నాడు. మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ, బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ సాల్ట్‌లేక్‌ స్టేడియంలో మెస్సీతో కలసి వేదికను పంచుకోనున్నారు. ఇక్కడ చిన్నారులతో మెస్సీ ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌లోనూ పాల్గొననున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం

87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!

Updated Date - Dec 09 , 2025 | 05:55 AM