Share News

Meenakshi Hooda: పసిడి పోరుకు మీనాక్షి

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:17 AM

ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో మరో భారత బాక్సర్‌ స్వర్ణ పతక పోరులో అడుగుపెట్టింది. మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షి హూడా ఫైనల్‌కు

Meenakshi Hooda: పసిడి పోరుకు మీనాక్షి

ప్రపంచ బాక్సింగ్‌

లివర్‌పూల్‌ (ఇంగ్లండ్‌): ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో మరో భారత బాక్సర్‌ స్వర్ణ పతక పోరులో అడుగుపెట్టింది. మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షి హూడా ఫైనల్‌కు దూసుకు పోయింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మీనాక్షి 5-0తో మంగోలియాకు చెందిన లుట్సైఖనీ అల్టాన్‌సెట్సెగెని చిత్తు చేసింది. ఈ పోటీలలో ఫైనల్‌కు చేరిన మూడో భారత్‌ బాక్సర్‌ మీనాక్షి. ఇంతకుముందు..జైస్మిన్‌ లంబోరియా (57 కి.), నూపుర్‌ షెరాన్‌ (80+కి.) టైటిల్‌ ఫైట్‌కు చేరిన సంగతి తెలిసిందే. 80+కి. కేటగిరీ సెమీఫైనల్లో షెరాన్‌ 5-0తో సెమా డుజ్టస్‌ (టర్కీ)పై గెలిచింది. దాంతో మీనాక్షి, జైస్మిన్‌, నూపుర్‌ కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నారు. ఇక మహిళల 80 కిలోల విభాగంలో పూజారాణి సెమీఫైనల్లో ప్రవేశించింది. దాంతో ఆమెకు కనీసం కాంస్య పతకం లభించనుంది. మొత్తంగా..ప్రపంచ చాపియన్‌షి్‌ప్సలో భారత్‌కు నాలుగు పతకాలు ఖాయమయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 14 , 2025 | 05:17 AM