Indo Pak Cricket Clash 2025: భారత్ పాక్ మ్యాచ్‌కు తగ్గిన డిమాండ్
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:40 AM
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ రెండు జట్లు తొలిసారిగా తలపడనుండడంతో...
పూర్తిగా అమ్ముడుపోని టికెట్లు
దుబాయ్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ రెండు జట్లు తొలిసారిగా తలపడనుండడంతో.. డిమాండ్ భారీగా ఉంటుందని అంచనా వేశారు. కానీ, ఆసియాక్‌పలో ఆదివారం జరిగే ఇండో-పాక్ మ్యాచ్ టికెట్లు ఇంకా అందుబాటులో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైవోల్టేజ్ మ్యాచ్‌కు డిమాండ్ తగ్గడానికి అధిక ధరలే కారణమని తెలుస్తోంది. రెండు సీట్లకు రూ. 10,000 అన్నింటికంటే తక్కువ. వీఐపీ రాయల్ బాక్స్‌లో జతకు రూ. 2,30,700, స్కైబాక్స్ టికెట్ రూ. 1,67,851గా నిర్ణయించారు. ప్లాటినం రూ. 75,658, గ్రాండ్ లాంజ్ రూ. 41,153 లాంటి మధ్య శ్రేణి టికెట్లు కూడా సగటు ప్రేక్షకుడికి అందుబాటులో లేవు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి