Share News

Lords Cricket Ground: అమ్మకానికి లార్డ్స్‌ పిచ్‌

ABN , Publish Date - Aug 10 , 2025 | 05:48 AM

ప్రపంచ క్రికెట్‌లో లార్డ్స్‌ మైదానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇక్కడ శతకం బాదినా.. ఐదు వికెట్ల మైలురాయి అందుకున్నా వారి పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఎన్నో అద్భుత మ్యాచ్‌లకు వేదికగా...

Lords Cricket Ground: అమ్మకానికి లార్డ్స్‌ పిచ్‌

లండన్‌: ప్రపంచ క్రికెట్‌లో లార్డ్స్‌ మైదానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇక్కడ శతకం బాదినా.. ఐదు వికెట్ల మైలురాయి అందుకున్నా వారి పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఎన్నో అద్భుత మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన ఈప్రఖ్యాత మైదానం పిచ్‌ను ముక్కల వారీగా అమ్మకానికి ఉంచుతున్నట్టు నిర్వాహక మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ప్రకటించింది. పిచ్‌తో పాటు మైదానం టర్ఫ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. 1.2-0.6మీ. సైజు పిచ్‌ భాగాన్ని భారత కరెన్సీలో రూ.5 వేల చొప్పున అమ్మనున్నారు. అయితే ఈ అవకాశం ముం దుగా తమ 25వేల మంది ఎంసీసీ సభ్యులకు ఇవ్వనుంది. ఆ తర్వాత క్రికెట్‌ అభిమానులు కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా వచ్చే నిధుల్లో పది శాతం ఎంసీసీ ఫౌండేషన్‌కు వెళతాయి. మిగతా మొత్తంతో స్టేడియంలో సౌకర్యాల మెరుగుదలకు వినియోగిస్తారు. మరోవైపు వచ్చేనెల నుంచి లార్డ్స్‌ గ్రౌండ్‌ను ఆధునీకరించనున్నారు. అందులో భాగంగానే పిచ్‌ చుట్టుపక్కల ఉండే పచ్చికను తొలగించి, అవుట్‌ఫీల్డ్‌ను కూడా తవ్వి సరికొత్త సర్ఫే్‌సను ఉంచుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు

పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి

Updated Date - Aug 10 , 2025 | 05:48 AM