Lionel Messis Business Empire: వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:04 AM
లియోనెల్ మెస్సీ విశ్వవిఖ్యాత ఫుట్‌బాలరే కాదు.. అత్యంత ధనవంతుడైన అథ్లెట్లలో ఒకడు..! తన ఆట వెనుక వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా...
రేపు హైదరాబాద్‌కు
లియోనెల్ మెస్సీ విశ్వవిఖ్యాత ఫుట్‌బాలరే కాదు.. అత్యంత ధనవంతుడైన అథ్లెట్లలో ఒకడు..! తన ఆట వెనుక వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకొన్నాడు. మెస్సీ నికర ఆస్తుల విలువ రూ. 7,665 కోట్లుగా లెక్కిస్తుంటే.. అందులో సింహభాగం అతడు నడుపుతున్న వ్యాపార సంస్థల నుంచి వస్తున్నదే..! లగ్జరీ హోటళ్లు, దుస్తుల బ్రాండ్‌లు, మీడియా కంపెనీలు, రియల్ ఎస్టేట్‌లో లియోనెల్ భారీగా పెట్టుబడులు పెట్టాడు. వీటితోపాటు ఇంటర్ మయామి తరఫున ఆడేందుకు భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకొన్నాడు. అంతేకాకుండా పలు కంపెనీల బ్రాండ్‌లకు ప్రచారకర్తగా కూడా ఆర్జిస్తున్నాడు.

ఎంఐఎం హోటళ్లు..: ఇబిజా, మలోర్కా, సిట్గేజ్, బకీరా, అండోరాల్లో ఎంఐఎం హోటళ్ల చైన్‌ను మెస్సీ కలిగి ఉన్నాడు. మెజెస్టిక్ హోటల్ గ్రూప్ వీటిని నిర్వహణను చూసుకొంటోంది. అందమైన బీచ్‌లు, కొండ ప్రాంతాల్లోనే ఈ హోటళ్లు ఎక్కువగా ఉంటాయి.
ద మెస్సీ స్టోర్..: 2019లో బార్సిలోనాలో స్పోర్ట్స్ వేర్, లైఫ్‌స్టైల్ దుస్తుల స్టోర్‌ను మెస్సీ ఆరంభించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో కూడా విక్రయిస్తున్నారు.
మాస్ ప్లస్..: 2024, జూన్‌లో ‘మాస్+’ పేరుతో మెస్సీ తన సొంత ఎనర్జీ డ్రింక్ బ్రాండ్‌ను విడుదల చేశాడు. అమెరికా మార్కెట్‌లో ఈ డ్రింక్ విక్రయాలు జోరుగానే ఉన్నాయి.
రోజారియో మీడియా కంపెనీ..: 2022లో ఈ మీడియా కంపెనీని మెస్సీ ఏర్పాటు చేశాడు. ఫ్యామిలీ, స్పోర్ట్స్ షోలతోపాటు ఓటీటీ కంటెంట్‌ను కూడా ఈ కంపెనీ నిర్మిస్తోంది. అర్జెంటీనా నిర్మాతలు, హాలీవుడ్ స్టూడియోలతో కలసి ఈ కంపెనీ పనిచేస్తోంది. అంతేకాకుండా ‘ఎల్ క్లబ్ డి లా మిలనెసా’ హోటల్ గ్రూప్‌లో కూడా మెస్సీ పెట్టుబడులు పెట్టాడు. 2022లో ‘ప్లే టైమ్ స్టోర్ట్స్’ పేరుతో టెక్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థను కూడా ప్రారంభించాడు.

మెస్సీ టూర్ షెడ్యూల్
డిసెంబరు 13 కోల్‌కతా: ఉ. 9.30 నుంచి 10.30 వరకు-మీట్ అండ్ గ్రీట్ ఫఉ. 10.30 నుంచి 11.15 వరకు-వర్చువల్‌గా మెస్సీ విగ్రహావిష్కరణ ఫమధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు-ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మాన కార్యక్రమం, అతిథులతో పరిచయం
హైదరాబాద్‌లో: సా. 4.30 నుంచి-ఫలక్‌నుమా ప్యాలె్‌సలో మీట్ అండ్ గ్రీట్ ఫరాత్రి 7 గంటలకు-ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఫ సంగీత విభావరి
డిసెంబరు 14 ముంబై: మ. 3.30 నుంచి- సీసీఐలో జరిగే పడేల్ కప్‌లో పాల్గొనడం ఫ4 గంటల నుంచి-సెలెబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫ5 గం. నుంచి-వాంఖడే స్టేడియంలో పలు కార్యక్రమాలతోపాటు ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్
డిసెంబరు 15- న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వక భేటీ ఫమధ్యాహ్నం 1.30 నుంచి-అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే పలు కార్యక్రమాలతోపాటు మెనిర్వా అకాడమీ ఆటగాళ్లకు సన్మానం
ఇవీ చదవండి:
సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ