LIVE UPDATES: రేవంత్, రాహుల్‌కు జెర్సీలను అందజేసిన మెస్సీ
ABN , First Publish Date - Dec 13 , 2025 | 11:23 AM
అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లి మ్యాచ్‌ను మెస్సీ ఆడనున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం
Live News & Update
-
Dec 13, 2025 21:14 IST
సీఎం రేవంత్, రాహుల్‌కు.. మెస్సీ పేరుతో ఉన్న జెర్సీలను అందజేసిన మెస్సీ
మెస్సీతో కలిసి స్టేడియం అంతా కలియతిరిగిన సీఎం రేవంత్
చిన్నారులతో సరదాగా ఫుట్‌బాల్ ఆడిన మెస్సీ
ఫుట్‌బాల్ ఎలా ఆడాలో పిల్లలకు టిప్స్ చెప్పిన మెస్సీ.
-
Dec 13, 2025 20:55 IST
ఫుట్‌బాల్ ప్రమోషనల్ ఈవెంట్‌లో సింగరేణి RR టీమ్ విజయం
సింగరేణి RR టీమ్‌కి ట్రోఫీ అందజేసిన మెస్సీ
అపర్ణ మెస్సీ టీమ్‌కి ట్రోఫీ ప్రదానం చేసిన సీఎం రేవంత్
స్టేడియంలో అభిమానులకు మెస్సీ అభివాదం
ఇరుజట్లతో ఫొటోలు దిగిన మెస్సీ, సీఎం రేవంత్
గ్యాలరీలో అభిమానులకు ఫుట్‌బాల్ కిక్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చిన మెస్సీ
-
Dec 13, 2025 20:16 IST
గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
గ్రౌండ్‌లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ
గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి
-
Dec 13, 2025 20:13 IST
సింగరేణి RR టీమ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
అపర్ణ మెస్సీ టీమ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ
మెస్సీ టీమ్‌పై ఆధిక్యంలో సీఎం రేవంత్ టీమ్
-
Dec 13, 2025 20:10 IST
ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, రేవంత్ ఫుట్‌బాల్ ప్రమోషనల్ ఈవెంట్
గ్రౌండ్‌లోకి దిగిన సీఎం రేవంత్
సింగరేణి RR - అపర్ణ మెస్సీ టీమ్ మధ్య ఫుట్‌బాల్ ప్రమోషనల్ ఈవెంట్
-
Dec 13, 2025 19:53 IST
రాహుల్ గాంధీతో కలిసి ఫలక్‌నూమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియానికి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాసేపట్లో మెస్సీ, రేవంత్ ఫుట్‌బాల్ ప్రమోషనల్ ఈవెంట్
-
Dec 13, 2025 19:16 IST
ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతా
-
Dec 13, 2025 19:15 IST
ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియానికి మెస్సీ..
ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియానికి బయలుదేరిన మెస్సీ..
కాసేపట్లో మెస్సీ, సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ప్రమోషనల్ ఈవెంట్..
-
Dec 13, 2025 19:06 IST
ఉప్పల్ స్టేడియం: మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా మ్యూజికల్ ప్రోగ్రాం..
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆట.. పాట..
స్టేడియంలో ఫ్యాన్స్ ఉర్రూతలూగిస్తోన్న రాహుల్..
-
Dec 13, 2025 17:12 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బయలుదేరిన లియోనెల్ మెస్సీ..
-
Dec 13, 2025 17:09 IST
మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతి
మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ ఫొటో సెషన్..
మెస్సీని కలిసేవారికి క్యూ ఆర్ కోడ్..
ఫలక్‌నుమా ప్యాలెస్ దగ్గర భారీ బందోబస్తు.
-
Dec 13, 2025 16:41 IST
మరి కొద్దిసేపట్లో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకోనున్న మెస్సీ
-
Dec 13, 2025 16:35 IST
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్న లియోనల్ మెస్సిీ..
-
Dec 13, 2025 15:51 IST
ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి రాహుల్ గాంధీ..
స్వాగతం పలికిన సీఎం రేవంత్, మహేష్ గౌడ్, మంత్రులు.
-
Dec 13, 2025 15:29 IST
మరికొద్దిసేపట్లో హైదరాబాద్‌కి మెస్సీ..
శంషాబాద్: మరికొద్ది సేపట్లో హైదరాబాద్‌కి చేరుకోనున్న ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ..
మెస్సీ రాకతో భద్రత వలయంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్.
-
Dec 13, 2025 15:27 IST
ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద భారీ బందోబస్తు..
ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు..
4 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టకు చేరుకోనున్న ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు మెస్సి..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు రానున్న మెస్సి..
7 గంటల వరకు ఫలక్‌నుమా ప్యాలెస్ లోనే ఉండనున్న మెస్సి..
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం, ఇక్కడే మెస్సిని కలవనున్న సీఎం..
మరోవైపు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు రాహుల్ గాంధీ రాక.
7గంటలకు మెస్సీతో కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్న సీఎం రేవంత్, రాహుల్..
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీ బస చేస్తుండడంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు..
భద్రతను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న జాయింట్ సీపీ తప్సీర్ ఇక్బాల్
ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్న డీజపీ శివధర్ రెడ్డి..
-
Dec 13, 2025 15:11 IST
ఏబీఎన్‌తో SATS చైర్మన్ శివసేనా రెడ్డి..
కలకత్తా లాంటి సంఘటనలు హైదరాబాద్‌లో జరగవు..
ఇది పూర్తిగా ఫ్రెండ్లీ మ్యాచ్..
పూర్తి స్థాయి మ్యాచ్ కాదు..
క్రీడలను ప్రోత్సహించడానికి జరుగుతున్న మ్యాచ్..
సీఎం రేవంత్ నిర్ణయంతో విద్యార్థులు క్రీడల వైపు ఆలోచిస్తారు ..
రాజకీయాల్లో అయినా క్రీడల్లో అయినా రేవంత్ దే పై చేయి: SATS చైర్మన్
-
Dec 13, 2025 15:02 IST
సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ ప్రమోషనల్ ఈవెంట్
మెస్సీ-రేవంత్ మధ్య ఆటను వీక్షించనున్న రాహుల్ గాంధీ
-
Dec 13, 2025 13:18 IST
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం నిర్వహణ సరిగా లేదని ఆరోపిస్తూ ఆగ్రహించిన అభిమానులు స్టేడియంను ధ్వంసం చేస్తున్న విజువల్స్
-
Dec 13, 2025 12:40 IST
మెస్సిని కలిసిన నటుడు షారుక్ ఖాన్
-
Dec 13, 2025 12:38 IST
మెస్సిపై అభిమానుల ఆగ్రహం..
-
Dec 13, 2025 12:37 IST
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో అల్లకల్లోలం
-
Dec 13, 2025 12:34 IST
మెస్సి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన G.O.A.T ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్‌కు చేరుకుంటారు
-
Dec 13, 2025 12:30 IST
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సి అభిమానులు ఆగ్రహం
మెస్సి మ్యాచ్ ఆడకుండా వెళ్లడంతో ఫ్యాన్ నిరసన
గ్రౌండ్‌లోకి కుర్చీలు విసిరేసిన అభిమానులు, ఫ్లెక్సీలు చించివేత,
-
Dec 13, 2025 12:28 IST
హైదరాబాద్ కు మెస్సీ..2,500 మంది పోలీసులతో భద్రత..
-
Dec 13, 2025 12:27 IST
ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టనున్న రేవంత్ ,మెస్సీ..
-
Dec 13, 2025 12:25 IST
మెస్సీని చూసేందుకు తరలివస్తున్న అభిమానులు
-
Dec 13, 2025 12:24 IST
హైదరాబాద్‌లో మెస్సీ మేనియా..
-
Dec 13, 2025 11:23 IST
కోల్‌కతాలో అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ పర్యటన
తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించిన మెస్సీ
కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్
కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్
