Share News

England Squad Change: తుది జట్టులో డాసన్‌

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:40 AM

భారత్‌తో ఈనెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ప్రకటించారు. చేతి వేలి గాయంతో జట్టుకు దూరమైన స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ స్థానంలో...

England Squad Change: తుది జట్టులో డాసన్‌

నాలుగో టెస్టుకు ఇంగ్లండ్‌ టీమ్‌

మాంచెస్టర్‌: భారత్‌తో ఈనెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ప్రకటించారు. చేతి వేలి గాయంతో జట్టుకు దూరమైన స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ స్థానంలో 35 ఏళ్ల లెఫ్టామ్‌ స్పిన్నర్‌ లియామ్‌ డాసన్‌కు చోటు కల్పించారు. లార్డ్స్‌ టెస్టులో ఆడిన ఇంగ్లండ్‌ జట్టులో ఇదొక్కటే మార్పు కావడం గమనార్హం. దీంతో డాసన్‌ ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడబోతున్నాడు. కెరీర్‌లో తను మూడు టెస్టులు ఆడగా 2017లో చివరిసారి దక్షిణాఫ్రికాపై బరిలోకి దిగాడు.

తుది జట్టు: స్టోక్స్‌ (కెప్టెన్‌), క్రాలే, డకెట్‌, రూట్‌, పోప్‌, బ్రూక్‌, స్మిత్‌, వోక్స్‌, డాసన్‌, కార్స్‌, ఆర్చర్‌.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 05:40 AM