Share News

ప్రీక్వార్టర్స్‌కు లక్ష్య సేన్‌,మాళవిక

ABN , Publish Date - Mar 12 , 2025 | 02:17 AM

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఏస్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌, మాళవిక బన్సోడ్‌ ముందంజ వేయగా.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌...

ప్రీక్వార్టర్స్‌కు లక్ష్య సేన్‌,మాళవిక

ప్రణయ్‌ ఇంటిదారి

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఏస్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌, మాళవిక బన్సోడ్‌ ముందంజ వేయగా.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో లక్ష్య సేన్‌ 13-21, 21-17, 21-15తో లి యంగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచాడు. తొలి గేమ్‌లో ఓడినా.. సేన్‌ బలంగా పుంజుకొని మిగతా రెండు గేమ్‌లో నెగ్గాడు. రెండో రౌండ్‌లో మూడో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో సేన్‌ తలపడనున్నాడు. కాగా, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 19-21, 16-21తో టోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో వరుస గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోడ్‌ 21-13, 10-21, 21-17తో యో జి మిన్‌ (సింగపూర్‌)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకొంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సతీష్‌ కుమార్‌-ఆద్య వరియత్‌ జంట 6-21, 15-21తో చైనాకు చెందిన గు జిన్‌ వ-చెన్‌ ఫాంగ్‌ హుయ్‌ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంట 20-22, 18-21తో చైనీస్‌ తైపీకి చెందిన షి పి షాన్‌-హంగ్‌ యన్‌ జు చేతిలో పోరాడి ఓడింది.

ఇవీ చదవండి:

అందరి అడుగులు పంత్ ఇంటి వైపే

అంత ఈజీనా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్

ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2025 | 02:17 AM