Hong Kong Open: సెమీసలో సాత్విక్ జోడీ
ABN , Publish Date - Sep 13 , 2025 | 02:39 AM
భారత షట్లర్లు లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్ దిశగా దూసుకెళ్తున్నారు. సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్ ద్వయం సెమీఫైనల్లో ప్రవేశించారు....
లక్ష్యసేన్ కూడా..
హాంకాంగ్ ఓపెన్
హాంకాంగ్: భారత షట్లర్లు లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్ దిశగా దూసుకెళ్తున్నారు. సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్ ద్వయం సెమీఫైనల్లో ప్రవేశించారు. ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య జరిగిన సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో లక్ష్య 21-16, 17-21, 21-13తో ఆయుష్ షెట్టిపై గెలుపొందాడు. గత మ్యాచ్‌లో 2024 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ కొడాయి నరౌకాకి షాకిచ్చి సంచలనం సృష్టించిన ఆయుష్.. లక్ష్యతో పోరులో మాత్రం తడబడ్డాడు. అయితే ఓడినా.. ఆయుష్ గెలుపు కోసం చివరిదాకా పోరాడిన తీరు ఆకట్టుకుంది. గంటా ఆరు నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్ ఓడినా, రెండో గేమ్‌లో లక్ష్యపై పైచేయి సాధించి మ్యాచ్ గెలిచేలా కనిపించాడు. కానీ, నిర్ణాయక మూడో గేమ్ ఆఖర్లో పలుమార్లు ఔట్ షాట్‌లు కొట్టి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఫైనల్ బెర్త్ కోసం తైవాన్ షట్లర్, మూడో సీడ్ చో తిన్ చెన్‌తో లక్ష్య అమీతుమీ తేల్చుకోనున్నాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్‌లో 8వ సీడ్ సాత్విక్/చిరాగ్ జంట 21-14, 20-22, 21-16తో మలేసియా జోడీ ఆరిఫ్ జునైది/రాయ్ కింగ్ యాప్‌ను ఓడించింది. ఇటీవలే ప్రపంచ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకంతో సత్తా చాటిన సాత్విక్ ద్వయం సెమీఫైనల్లో తైవాన్ జోడీ చెన్ చెంగ్ కాన్/లిన్ బింగ్ వీతో తలపడనుంది.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి