Share News

కుల్దీప్‌.. ఫినిషర్‌

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:21 AM

భారత పరిమిత ఓవర్ల జట్టులో ఎడమచేతి మణికట్టు మాంత్రికుడు కుల్దీప్‌ యాదవ్‌ది కీలక స్థానం. అతడి మ్యాజిక్‌ బంతులను అర్థం చేసుకోలేక ప్రత్యర్థి బ్యాటర్లు బోల్తా పడుతుంటారు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో

కుల్దీప్‌.. ఫినిషర్‌

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

భారత పరిమిత ఓవర్ల జట్టులో ఎడమచేతి మణికట్టు మాంత్రికుడు కుల్దీప్‌ యాదవ్‌ది కీలక స్థానం. అతడి మ్యాజిక్‌ బంతులను అర్థం చేసుకోలేక ప్రత్యర్థి బ్యాటర్లు బోల్తా పడుతుంటారు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి బంతుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ మ్యాచ్‌లో పాక్‌ ఓ దశలో 200/5తో భారీస్కోరు దిశగా వెళుతోంది. మరో 8 ఓవర్లు కూడా ఉన్నాయి. ఆ సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ లెగ్గీ కుల్దీప్‌నే నమ్ముకున్నాడు. 43వ ఓవర్‌లో బంతి చేతపట్టిన అతను ఫామ్‌లో ఉన్న సల్మాన్‌ ఆఘాతో పాటు షహీన్‌ను వరుసగా పెవిలియన్‌ చేర్చి పాక్‌ను కంగారెత్తించాడు. గూగ్లీలతో పాటు బంతిని కాస్త స్వింగ్‌ చేయగల వైవిధ్యం కారణంగా కుల్దీప్‌ చివరి 10 ఓవర్లలోనూ ప్రభావం చూపగలుగుతున్నాడు. వాస్తవానికి అతను గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చినా, ఇప్పటివరకు మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. 2015 నుంచి 40-45 ఓవర్ల మధ్య కుల్దీప్‌ 25 వికెట్లు తీశాడు. రషీద్‌, జంపా మాత్రమే అతడికన్నా ఎక్కువ వికెట్లు తీయగలిగారు. వైవిధ్యంగా బంతులు వేస్తే స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు కష్టమని, అందుకే డెత్‌ ఓవర్లలో రోహిత్‌ తనను ఎంపిక చేసుకుంటున్నట్టు కుల్దీప్‌ చెబుతున్నాడు.


దుబా య్‌ వికెట్‌ కూడా నెమ్మదిగా ఉండడం అతడికి కలిసివస్తోంది. అయితే ఇటీవల మరో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి విశేషంగా రాణిస్తుండడంతో కుల్దీ్‌పకు చోటు కష్టమేననే భావన వ్యక్తమైంది. చాంపియన్స్‌ ట్రోఫీలో జడేజా, అక్షర్‌లకు తోడు వరుణ్‌ ఉంటాడనే అనుకున్నారంతా. ‘వైట్‌బాల్‌ క్రికెట్‌లో కుల్దీప్‌ రికార్డు చూడండి. అతడు మ్యాచ్‌లో ఏ దశలోనైనా బౌలింగ్‌ చేసి పరుగులను కట్టడి చేయగలడు. అలాగే భాగస్వామ్యాలను విడదీసే సామర్థ్యం కూడా ఉంది. అందుకే అతను ఫిట్‌గా ఉంటే తుది జట్టులోకి కచ్చితంగా వస్తాడు’ అని ఓ మాజీ స్పిన్నర్‌.. కుల్దీ్‌పనకు మద్దతు పలికాడు. పాక్‌తో మ్యాచ్‌లో కుల్దీప్‌ తొలి పవర్‌ప్లే నుంచి 45 ఓవర్ల మధ్యలో బౌలింగ్‌ చేశాడు. అతడి 9 ఓవర్లలో మూడు ఫోర్లు మాత్రమే రాగా, 3 వికెట్లు పడగొట్టాడు. పేసర్‌ మహ్మద్‌ షమి, టోర్నీలో ఇంకా ఆడని అర్ష్‌దీ్‌పలాంటి చక్కటి యార్కర్‌ బౌలర్లు కలిగిన జట్టులో మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ డెత్‌ ఓవర్లలో నమ్మదగ్గ ప్లేయర్‌గా మారడం విశేషమే.


ఇవీ చదవండి:

టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ

భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..

భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2025 | 05:21 AM